అదిలాబాద్

వచ్చే యేడాదికల్లా వంతెనలు పూర్తి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెజ్జూరు, ఆగస్టు 28: వచ్చే యేడాదికల్లా బెజ్జూరు మండలంలో ఉన్న వంతెనలను పూర్తి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం బెజ్జూరు మండలంలోని దింద, గూడెం వంతెనలను పరిశీలించారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహితపై తెలంగాణ ప్రభుత్వం రూ.56కోట్లతో వంతెనకు నిధులు మంజూరు చేసిందని, అట్టి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వంతెన పూర్తయతే తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలకు రహదారి సౌకర్యం కలుగుతుందన్నారు. మండలంలోని దిందవాగుపై రూ.5కోట్లతో వంతెనకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. మండలంలోని కుకుడ, అగర్‌గూడ, రేచిని వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. బెజ్జూరు మండలంలోని రోడ్డు రవాణా సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని సిసి రోడ్డు నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరై పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాలకు అంతర్గత రోడ్లు, రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రహారీ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆయన వెంట కౌటాల జడ్పీటీసీ సభ్యులు డుబ్బుల నానయ్య, సర్పంచ్‌లు అశోక్‌రెడ్డి, రాజన్న, పంచాయతీరాజ్ ఏ ఈ రాజలింగు, తెరాస నాయకులు హర్షద్ హుస్సేన్, జగ్గాగౌడ్, సదాశివ్ తదితరులున్నారు.