అదిలాబాద్

వన సంరక్షణకు పాటుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 28: వన సంరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర అమ్మవారి ఆలయానికి చెందిన భూములలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరు వన సంరక్షణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 23 శాతం ఉన్న అడవి సంపదను 33 శాతానికి పెంచేందుకు అందరూ కృషిచేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణకు పాటుపడాలని సూచించారు. మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, వాటిని సంరక్షిస్తే రాబోయే తరాలకు అవి ఫలాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో భైంసా మార్కెట్ కమిటి వైస్ ఛైర్మెన్ ఉబేదుల్లాఖాన్, పి ఎసి ఎస్ మాజీ ఛైర్మెన్ నూకం రామారావు, బల్గం దేవెంధర్, హన్మంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.