అదిలాబాద్

జిల్లాల విభజనపై హోరెత్తిన అందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: జిల్లాల పునర్విభజన లొల్లి గురువారం జిల్లాలో అట్టుడికింది. ఆదిలాబాద్ పరిరక్షణ సమితి అధ్వర్యంలో నిర్మల్ జిల్లాను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ వెనకబడిన జిల్లాకు నష్టం చేకూర్చవద్దని డిమాండ్ చేస్తూ గురువారం ఇచ్చిన బంద్ పిలుపు సంపూర్ణంగా ముగిసింది. కిల్లికొట్టు నుండి పెట్రోల్ బంక్‌ల వరకు, విద్యాసంస్థల నుండి సినిమా థియేటర్లను మూసివేసి బంద్ పాటించడంతో జనజీవనం స్థంభించిపోయింది. జిల్లాను మూడు ముక్కలు చేయడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 16 మండలాలు మరింత వెనకబాటుకు గురై తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందని, నిర్మల్‌జిల్లాను తెరపైకి తీసుకరావడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు, బస్సు విధ్వంసాలు నిర్వహించి అందోళనలు ఉదృతం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ప్రతిరోజు తమ నిరసనలు కొనసాగిస్తామని పరిరక్షణ సమితి వేదిక నేతలు ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉదయం నుండే బిజెపి, టిడిపి, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నేతలు బైక్‌ర్యాలీలు నిర్వహించి ఒక్కదుకాణం కూడా తెరవకుండా మూసివేయించారు. పెట్రోల్‌బంక్‌లు, చిరు హోటళ్లు, విద్యాసంస్థలు, ఆర్టీసి బస్సులు బంద్‌లో పాల్గొనడంతో జనజీవనం స్థంభించిపోయింది. ఉదయం 5 గంటలకే పరిరక్షణ సమితి అధ్వర్యంలో ఉద్యమకారులు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైటాయించి బస్సులను డిపోకే పరిమితం చేశారు. దీంతో ఆర్టీసీ ప్రయాణప్రాంగణం ప్రయాణికులు లేక వెలవెల బోయింది. ప్రైవేట్ వాహన సర్వీసులు చార్జీలు పెంచి ప్రయాణికులను నిలువుదోపిడి చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాను రెండు ప్రాంతాలుగానే విభజించాలని డిమాండ్ చేస్తూ బిసి, యువజన సంఘాల అధ్వర్యంలో కొనసాగుతున్న ఆమరణ దీక్షలు గురువారం రాత్రి వరకు 4వ రోజుకు చేరుకోగా రాత్రి 8 గంటలకు పోలీసులు దీక్షలో కూర్చున్న సామల ప్రశాంత్, ప్రమోద్ ఖత్రి, బాల శంకర్ కృష్ణ, మనోజ్ పవార్, సురేందర్‌లను బలవంతంగా అరెస్ట్ చేసి, రిమ్స్‌కు తరలించారు. దీంతో ఉద్యమకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివిధ పక్షాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, 1969 తెలంగాణ తొలి ఉద్యమకారులు సంఘీభావం ప్రకటించారు. టైర్లను రహదారులపై తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అధ్వర్యంలో బిజెవై ఎం, బిజెపి కార్యకర్తలు పట్టణంలో భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. అదేవిధంగా టిడిపి జిల్లా నాయకులు రాజేశ్వర్, అన్నపూర్ణ, భూమన్న అధ్వర్యంలో మోటారుసైకిల్ ర్యాలీ, రాస్తారోకోనిర్వహించారు. ఇదిలా ఉంటే విభజన ద్రోహుల పేరిట మంత్రి జోగు రామన్న, ఎంపి గెడం నగేష్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సిలను హిజ్రాల చేత దగ్ధం చేయించారు. మరోవైపు ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ చౌరస్తాలో నిజమాబాద్ డిపోకు చెందిన ఏపి25జెడ్0015 ఆర్టీసీ బస్సు అద్దాలను అందోళనకారులు ధ్వంసం చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లాను వ్యతిరేకిస్తూ తాంసి, తలమడుగు మండలాల ప్రజలు సరహిద్దులోని సుంకిడి అంతరాష్ట్ర రహదారిని దిగ్బంధనం చేసి ఇరువైపుల మూడు గంటల పాటు వాహనాలను నిలిపివేశారు. భుత్వం దిగివచ్చే వరకు తమ అందోళన విరమించేది లేదని పరిరక్షణ సమితి కన్వీనర్ ఈర్ల సత్యం, కో కన్వీనర్ జగదీష్ అగర్వాల్ స్పష్టం చేశారు. అదే విధంగా ఏజెన్సీ మండలాలను కలుపుతూ ఉట్నూరు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘం నాయకులు రాష్టర్రహదారిపై రాస్తారోకో చేపట్టారు.