అదిలాబాద్

అధిక దిగుబడులకు ఆధునిక సాగే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్దతులతో వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించేలా రైతుల్లో విస్తృత అవగాహన పరిజ్ఞానం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పాలక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సంవత్సరకాలంలో ఆత్మ ద్వారా జిల్లాలో చేపట్టిన ప్రగతిపై సమీక్షించగా పథకాల అమలులో ప్రగతి ఏమాత్రం బాగాలేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చకుండా ఆత్మ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా పథకాలు నీరుగారుతున్నాయని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కృషి సంచాయని యోజన పథకం కింద కోటి రూపాయిల నిధులతో కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన సమావేశంలో రైతులకు ఇతర రాష్ట్రాలకు తీసుకవెళ్ళి పంటల సాగుపై చైతన్యపర్చాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏమాత్రం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆత్మ పథక సంచాలకులు మనోహరరావు పనితీరుపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతు మిత్ర సంఘాలను బలోపేతం చేయాలని, రైతులకు ఆధునిక సాంకేతిక పద్దతులపై శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున జీవామృతం తయారు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఎంత మంది రైతులు ఉన్నారు, రైతు మిత్ర సంఘాలు ఎన్ని ఉన్నాయో తెలుపాలని వ్యవసాయ శాఖ జెడిని కలెక్టర్ వివరణ కోరగా జెడిఏ సమాధానం చెప్పకపోవడంపై పనితీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఆత్మ పథక సంచాలకులు 201516 ఆర్థిక సంవత్సరానికిగాను 2కోట్ల 4లక్షల 25వేల 500లకు యాక్షన్‌ప్లాన్, 201617 ఆర్థిక సంవత్సరంలో కోటి 64లక్షల 77వేల 600లకు యాక్షన్‌ప్లాన్, 201617 సంవత్సరంలో ప్రధాన మంత్రి కృషిసంచాయి యోజన పథకం ద్వారా కోటి ఒక లక్ష 9వేలకు యాక్షన్‌ప్లాన్ ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి కలెక్టర్ ఆమోదించారు. 2015 మార్చి 2016 ఆగస్టు వరకు జరిగిన ఖర్చులు రూ. కోటి 86లక్షల 5వేల 800లకు ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టగా ఖర్చుచేసిన వివరాలు ఏవిధంగా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, అనంతరం ఖర్చులను ఆమోదించారు. రైతులకు అవసరమైన విధంగా అభివృద్ది ప్రణాళికలు తయారు చేయాలని ఆత్మ పిడిని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జెడి ఆషాకుమారి, ఉద్యానశాఖ డిడి నర్సింగదాస్, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈవో కె.నరేందర్, వ్యవసాయ శాఖ ఏడిలు రమేష్, పుల్లయ్యతో పాటు ఆయా శాఖల అధికారులు, ఆదర్శరైతులు కొండయ్య చౌదరి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.