అదిలాబాద్

ఆశ్రమ పాఠశాలను ఐటిడిఎ పివో ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, సెప్టెంబర్ 22: మండలంలోని దస్తురాబాద్ గ్రామంలో గల గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక ఆశ్రమ పాఠశాలను గురువారం మధ్యాహ్నం ఉట్నూర్ ఐటిడిఎ పివో ఆర్‌వి కర్ణన్ సందర్శించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో పలు గదుల్లోకి వెళ్లి విద్యార్థులను కలిసి, విద్యాబోధనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మెనూ పాటిస్తున్నారా లేదా అన్న విషయంపై ఆరా తీశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు అందించడానికి నిల్వ ఉంచిన వస్తువులను పరిశీలించారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అందించే పలు వస్తువులను ఆయన పరిశీలించారు. పాఠశాలలో ఉన్న మూత్రశాల, మరుగుదొడ్లను పరిశీలించి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నిర్మించిన పై అంతస్తు భవనాన్ని పరిశీలించారు. ఇక్కడ విద్యాబోధన సక్రమంగా ఉందని, మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తున్నారన్నారని విద్యార్థులు చెప్పడంతో పివొ సంతృప్తి వ్యక్తంచేశారు. పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై సర్పంచ్ గాజర్ల గంగామణి, ఎంపిటిసి మల్లేష్‌రెడ్డి, ఉప సర్పంచ్ కమలాకర్‌గౌడ్‌లు పివొ దృష్టికి తీసుకవచ్చారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, పరిశుభ్రత పాటించాలని పివొ విద్యార్థులను కోరారు. విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమస్యలను పరిష్కరించడానికి తమవంతు కృషిచేస్తామని పీవొ హామీనిచ్చారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.