అదిలాబాద్

వరకట్నం వేధింపుల కేసులో అత్తమామలకు జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: అదనపు కట్నం కోసం కోడలిని మానసికంగా, శారీరకంగా వేధించి కిరోసిన్ పోసి హతమార్చిన కేసులో అత్తమామలకు జీవితఖైదు విధిస్తూ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయ గౌరి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. కడెం పోలీసు స్టేషన్ పరిధిలోని మొర్రిగూడ గ్రామానికి చెందిన సత్తవ్వ (25) అదే గ్రామానికి చెందిన మొకిరాల మల్లయ్యతో వివాహం జరిగింది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.40వేలు అదనపు కట్నం కింద ఇవ్వాలని అత్తమామలు వేధించడమే గాక 2013 జనవరి 30న ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్తమామలు గొడవచేసి వేధించడమేగాక కోడలి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించిన సంఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్తవ్వ మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ బాబు కేసు నమోదు చేయగా నిర్మల్ డి ఎస్పీ విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా పిపి కె.చంద్రశేఖర్ 22 మంది సాక్షులను కోర్టులు హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితులు అత్త అమృత, మామ మొకిరాల గంగన్నలకు జీవితఖైదుతోపాటు అదనంగా ఒక్కొక్కరికి రూ.27వేల చొప్పున జరిమాన విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు.