అదిలాబాద్

శిక్షణ అంశాలను పాఠశాలల్లో అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, సెప్టెంబర్ 22: శిక్షణ నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలుచేసినప్పుడే శిక్షణకు సార్థకత ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించిన ఉపాధ్యాయులకు నిర్మల్ డి ర్‌సిలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమానికి డిఈవో గురువారం హాజరై వారినుద్దేశించి మాట్లాడారు. ఆంగ్లమాద్యమానికి ప్రాముఖ్యత పెరిగిన దృష్ట్యా ఈ విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆంగ్ల బోధనలో మెలకువలను నేర్పడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేర్చుకున్న అంశాలను తూచా తప్పకుండా పాఠశాలల్లో అమలుచేసి విద్యార్థులు ఆంగ్లంలో నైపుణ్యం సాధించే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌లు కడార్ల రవీంద్ర, కిషన్‌రెడ్డి, నిర్మల్ డివిజన్‌లోని ఆంగ్ల మాద్యమ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.