అదిలాబాద్

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుంటాల, సెప్టెంబర్ 22: ప్రతీ గ్రామంలో ఉన్న మహిళలందరూ అన్నిరంగాల్లో రాణించాలని డిఆర్‌డిఎ పిడి అరుణకుమారి అన్నారు. గురువారం మండలంలోని పెంచికల్‌పాడ్ గ్రామాన్ని సందర్శించిన అనంతరం లోస్రా మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు బాగుంటాయన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న సభ్యులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుని తీసుకున్న రుణాలను బ్యాంకుల్లో అప్పజెప్పాలని ఆమె కోరారు. విద్యా, వైద్యం, తాగునీటి, పారిశుద్ధ్యం వంటి వివిధ అంశాలపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎడీవ శ్రీనివాస్‌రావు, సర్పంచ్ దాసరి కమల, ఎంపిటిసి వేదిక, ఎపిఎంలు భోజన్న, నాయకులు చంద్రకాంత్, అశోక్, అవధూత్‌పటేల్ తదితరులు ఉన్నారు.