అదిలాబాద్

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూర్, సెప్టెంబర్ 26: చెన్నూర్ మండలంలో సోమవారం స్థానిక ఎంపిడివో కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ముందుగా చెన్నూర్ పంచక్రోశ ఉత్తరవాహిని గోదావరికి మంగళహారతి ఇచ్చి గోదారమ్మకు ప్రజాప్రతినిదులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ 13 సంవత్సరాల తర్వాత గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోందన్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమున్న చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అధికారులు ఎవరూ కూడా వారం రోజుల వరకు సెలవులు పెట్టకుండా చూడాలన్నారు. స్థానిక ఎంపిడివో, తహసిల్దార్‌లు మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు వచ్చి విదులు నిర్వహించకుండా స్థానికంగా ఉంటూ పరిస్థితిలను పరిశీలించి కింది స్థాయి అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఆర్‌డబ్ల్యు ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. చెన్నూర్ మండలంలోని పంట పొలాలు వరదల ఉదృతికి నష్టపోతే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపిపి మైదం కళావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్, ఎంపిడివో మల్లేష్, తహసిల్దార్ దిలీప్‌కుమార్, క్లస్టర్ అధికారి డాక్టర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.