అదిలాబాద్

బడుగుల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ పండగగా మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సంధర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లా నుండి జన్మించి రాజకీయంగా, సామాజికంగా ఎత్తుపల్లాలను చవిచూసిన బాపూజీ ఉద్యమాలే ఊపిరిగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేశారని కొనియాడారు. జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన బాపూజీ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, ఆయన సూచించిన మార్గంలోనే నవ సమాజ నిర్మాణానికి ప్రభుత్వం పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన విలక్షణ జీవితశైలి ప్రతి ఒక్కరికి అనుసరణీయమని, ప్రభుత్వం బాపూజీ ఆశయాల సాధన కోసం బిసిల అభ్యున్నతికి పాల్పడుతుందని అన్నారు. జెసి సుందర్ అబ్నార్ మాట్లాడుతూ బాపూజీ జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రభుత్వం నిర్వహించడం ఆనందంగా ఉందని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు. డి ఆర్‌వో సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ స్వాప్నికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బాపూజీ 1915 సెప్టెంబర్ 27న వాంకిడి గ్రామంలో జన్మించి, ఆదిలాబాద్ జిల్లాకు పేరుతెచ్చిన మహానీయుడని కొనియాడారు. ఈ సంధర్భంగా బిసి సంక్షేమ శాఖ అధికారి మేఘనాథ్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ్ రావు, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి వనజారెడ్డి, గజిటెడ్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, కలెక్టరేట్ ఏవో అరవింద కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, సుశీల, ప్రభాకర్ స్వామి, కలెక్టరేట్ కార్యాలయపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజీ జన్మదిన,వర్ధంతి ఉత్సవాలను జరిపించాలని,అయన కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని,అలాగే బాపూజీ జన్మ స్థలమైన వాంకిడిలో సైతం మనం కూడా ఆయన విగ్రహాం ఏర్పాటు చేసుకొందామని పేర్కొన్నారు. బుదవారం వాంకిడి మండల కేంద్రంలో లక్షమన సేవ సదన్ వెల్ఫర్ సోసైటి స్వఛ్చంద సంస్ధ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజీ 101వ జయంతి,స్వఛ్చంద సంస్ధ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ వాది,స్వాతంత్ర సమరయోదుడు ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయం కోసం తెలంగాణ యువతరం పనిచేసి బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సి పురాణం సతీష్ పిలుపునిచ్చారు.గత ఆరు సంవత్సరాలుగా బాపూజి ఆశయాలకు అనుగుణంగా నిరుపేద ప్రజలకు సేవలందిస్తున్న లక్షమన సేవసదన్ వెల్ఫర్ సోసైటి కార్యక్రమాలను ఆయన ఆభినందించారు.సంస్ధ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత వైధ్యశిభిరాలు,వేసవిలో నీటి కటకట ఉన్న గ్రామాలను నీటి సరఫరా,గిరిజనులకు దోమతెరలు,దుప్పట్లు పంపిణి చేయడంతోపాటు యువకులకు క్రీడలు,గ్రామీణ మహిళలకు చైతన్య సదస్సులు ఏర్పాటు చయడంతోపాటు గ్రామీణ ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ సంతవ్సరం బాపూజి జన్మదినాన్ని పురస్కరించుకొని 22 మంది నిరుపేద గ్రామీణ మహిళలకు ఆర్ధిక స్వాలంబన కోసం సంవత్సరం వరకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టుమిషన్లను అందచేయడం ఆభినంద నీయమని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వరకు వాంకిడిలో ఆచార్య కొండా లక్ష్మన్ బాపూజితోపాటు కొట్నక భీంరావు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.అదేవిధంగా వాంకిడిని ఎమ్మెల్సి, ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి దత్తత తీసుకొని అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని,కొండా లక్ష్మన్ బాపూజీ ట్రస్టుని అభివృద్ది చేయడానికి పూర్తి సహాకారం అందించాలని వాంకిడి జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి ఎంపిపి దుర్గం ఆర్తిక,ఆసిఫాబాద్ మార్కెట్ చైర్మన శ్రీనివాస్,మాజి చైర్మన్ చిలువేరు వెంకన్న,సర్పంచ్ విమలబాయి,టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి విలాస్ కోబ్రగడే,వైఎస్‌ఆర్‌సిపి జిల్లాప్రచార కార్యదర్శి జమాల్‌పూరి సుధాకర్,సంస్ధ చైర్మన్ అవినాష్,వైస్ చైర్మన్ అశోక్ మహోర్కుర్,వాంకిడి తహాసిల్ధార్ మల్లికార్జున్,ఎంపిడిఒ అర్జున్ పవార్,వాంకిడి సిఐ ప్రసాద్‌రావు,బెండార ఎంపిటిసి తండూరి ఉష,బంబార సర్పంచ్ అప్పాల సంతోస్,మండల టిఆర్‌ఎస్ నాయకులు,సంస్ధ ప్రధాన కార్యదర్శి సభ్యులు మడావి దౌలత్‌కుమార్,కార్యదర్శి పసుపునూరి చంద్రశేఖర్,దేవగిరి శ్రీనవాస్,రామగిరి పురుషోత్తం, సిబ్బంది రాంచందర్,అరుణ్,రోహిదాస్,్భస్కర్,సలీమలతోపాటు మండల నాయకులు,మహిళలు,రైతులు పాల్గొన్నారు.