AADIVAVRAM - Others

చెట్టులా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చెట్టు నా ఆదర్శం’ అన్నాడు కవి ఇస్మాయిల్. ‘చెట్టులా...’ ఉండలేనని అంటాడు మరో తెలుగు కవి.
చెట్టు ఒక్కటే. చూసే దృక్కోణాలు వేరు. ఇది ఒక చెట్టు విషయంలోనే కాదు. చాలా విషయాల్లో కన్పిస్తుంది.
చెట్టుని ఉత్సాహభరితంగా చూడవచ్చు. చెట్టులా వుండటానికి చెట్టుని దర్శించవచ్చు. ఎందుకంటే చెట్టు నేలను వదిలిపెట్టదు. అంతేకాదు మూలాన్ని వదిలిపెట్టదు. వేర్లు లేకుండా చెట్టు లేదు. ఆకురాలు కాలంలో ఆకులని వదిలి పెడుతుంది. కొత్త ఆకులని మళ్లీ వేస్తుంది. నీడని ఇస్తుంది. కొన్ని చెట్టు పువ్వులని ఇస్తే మరికొన్ని ఫలాలని ఇస్తాయి. అన్నింటికి మించి ఆక్సిజన్‌ని ఇస్తాయి. వెదురుచెట్టు లాంటివి గాలి వీచినప్పుడు వంగిపోతాయి. కాని విరిగిపోవు. ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు చెట్టు గురించి. ఇవే కాదు. ఇన్ని పనులు చేస్తూ కదలని చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇట్లా చెట్టుని మన జీవితానికి అన్వయించుకోవచ్చు.
ఇది ఇలా వుంటే చెట్టుని మరో రకంగా చూశాడు ఓ తెలుగు కవి. చెట్టు ఓ వౌనిలా కన్పిస్తుందని అంటాడు. రోజూ జరుగుతున్న నేరాలు, అత్యాచారాలు తనని వౌనంగా ఉండనివ్వడం లేదు అంటాడు. కూతురు మీద తండ్రి దాడి, మూకుమ్మడి ఆత్మహత్యలు, ఎదురుదాడి లేకున్నా చేసే ఎన్‌కౌంటర్లు, రోడ్డు గీస్తున్న రక్త చిత్రాలు, నదుల విలయతాండవాలు తనని వౌనంగా, నిశ్శబ్దంగా వుండనివ్వడం లేదని అంటాడు. ఇంకా ఇలా అంటాడు.
‘ఒక వౌనిలా/ నిశ్శబ్దంగా/ నిశ్చలంగా/ దేనితో సంబంధం లేకుండా/ వుండాలనే ఉంటుంది.
కానీ/ వార్తల ఉరుములు/ అర్జునున్ని కాదు/ నర్సింహస్వామినే గుర్తుకు తెస్తాయి./ నర్సింహస్వామిని ఆవహించమంటాయి
చెట్టులా/ వౌనంగా వుండాలనే ఉంటుంది
కానీ..?
చెట్టు ఒక్కటే. కానీ రెండు దృక్కోణాలు. చెట్టు కదలకున్నా పెరుగుతుందని, ఎంతో మందికి నీడని ఇస్తుందని, కొంతమంది చూస్తే- చెట్టులా వౌనంగా ఉండటం కష్టం అని ఓ కవి అంటాడు.
ఏమైనా చెట్టు అందరికీ ఆదర్శం కావాలి. ఎందుకంటే చెట్టు ఓ ఉత్సాహం, ఓ ఉత్తేజం.
ఎన్నో రకాలుగా మనిషికి ఉపయోగపడుతుంది.
మనిషి మరో రకంగా ఉండటానికి, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండటానికి ఆలోచింపజేస్తుంది.

- జింబో 94404 83001