ఊపిరిలో నాన్నను నటించవద్దన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-- అక్కినేని అఖిల్ --
నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా పివిపి సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరం వి.పొట్లూరి, కవిన్ అనె్న రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం ఉదయం విడుదల చేశారు.
ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ, సినిమాలో వున్న డెప్త్ ట్రైలర్‌లో కనిపిస్తోందని, తన తండ్రి కుర్చీలో కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూసి, ఈ సినిమాలో నటించవద్దని తాను చెప్పానని, కానీ ట్రైలర్ చూశాక మంచి కథగా అనిపిస్తోందని తెలిపారు. ఇలాంటి కాంబినేషన్లు కలిస్తే మంచి విజువల్స్ ప్రేక్షకులకు కన్పిస్తాయని అన్నారు. ఇంత మంచి స్క్రిప్ట్ అందించిన దర్శకుడికి థాంక్స్ చెబుతున్నానని, సినిమాలో వైవిధ్యం కనిపిస్తోందని నాగచైతన్య తెలిపారు. పారిస్‌లో ఈ చిత్రాన్ని షూటింగ్ చేశామని, ఏ లొకేషన్, ల్యాండ్‌మార్క్ మిస్ కాకుండా ఓ మంచి జర్నీలా ఈ చిత్రాన్ని రూపొందించామని, తమ జీవితంలో మంచి చిత్రంగా కూడా మిగిలిపోతుందని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నాగార్జున కెరీర్‌లో బెస్ట్ మూవీగా ఊపిరి నిలుస్తుందని నిర్మాత పి.వి.పి తెలిపారు.
రెండు భాషల్లో కలిపి సుమారుగా 50 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కించామని, న్యూయార్క్, పారిస్ ప్రాంతాలు కనువిందు చేస్తాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, పాటలు:సిరివెనె్నల, రామ్‌జో, కెమెరా:పి.ఎస్.వినోద్, ఎడిటింగ్:మధు, మాటలు:అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వంశీ పైడిపల్లి.