రాష్ట్రీయం

అన్ని స్కూళ్లలో నర్సరీ, కెజి క్లాసులు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ప్రభుత్వ పాఠశాలల్లో 3,4,5 సంవత్సరాల పిల్లలు అందరినీ చేర్చుకుని వారికి నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం డిమాండ్ చేసింది. ఒక్కో జిల్లాలో కొన్ని మాత్రమే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించాలనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని విద్యాసంస్కరణ ఉద్యమం చైర్మన్ కంచ ఐలయ్య, ప్రధానకార్యదర్శి నాగాటి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 3-5 సంవత్సరాల వయస్సున్న బాల బాలికలు 18 లక్షల మంది ఉంటారని , అందులో మూడు లక్షల మంది ప్రైవేటు నర్సరీ స్కూళ్లలో వున్నారని అన్నారు. హైదరాబాద్ మరికొన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేవారే, అందువల్ల 15 లక్షల మందికి విద్యా హక్కు చట్టం సెక్షన్ 11 ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కెజి టు పిజి వరకూ ఉచిత విద్యా పథకం అమలుచేస్తామని హామీ ఇచ్చిందని దానిని అమలుచేయాలని అన్నారు.