ఆంధ్రప్రదేశ్‌

అన్ని వర్గాలకు సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రన్న బిసి స్వయం ఉపాధి ఉత్సవంలో డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి

కర్నూలు, మార్చి 13: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు ఆయా వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. చంద్రన్న బిసి స్వయం ఉపాధి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన వర్గాల వారికి 2,3వ విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ బిసి, ఎస్సీ, ఎస్టీలకే కాకుండా ఇతర అన్ని కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సిద్ధంగా ఉందని తెలిపారు. కాపుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించిన విషయం తెలిసిందేనని ఆ వర్గాన్ని బిసిలుగా గుర్తించడానికి కమిషన్ వేశామని విచారణ నివేదిక అందిన తరువాత బిసి జాబితాలో చేర్చే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
టిడిపి ఏర్పాటైన నాటి నుంచి బిసిల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తాము బిసిల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మరో పార్టీ కాని, ప్రభుత్వం కాని ప్రవేశపెట్టలేదన్నారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బిసిలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సదుద్దేశ్యంతో రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో నడవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా ప్రజలకే అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయమోహన్, తదితరులు పాల్గొన్నారు.