ఆంధ్రప్రదేశ్‌

వేల కోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి పన్నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా అధికార ప్రతినిధి అంబటి ఆరోపణ
గుంటూరు, డిసెంబర్ 29: రాష్ట్ర ముఖ్యమంత్రి, తనయుడు లోకేష్ కలిసి వేల కోట్లు దోచుకోడానికి తమ తాబేదార్లతో సింగపూర్ దేశంలో వందల కంపెనీలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. జిల్లాపార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. రాజధాని నిర్మాణాలను సింగపూర్ కంపెనీల పేరుతో ఇచ్చి, తమ తాబేదార్లకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించి దోపిడీకి పాల్పడనున్నారని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణాలకు భూములిచ్చారని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశస్థులకు 99 సంవత్సరాల లీజు పేర వేలాది కోట్లు దోచుకోడానికి సిద్ధవౌతున్నారని విమర్శించారు. విజయవాడలోని మేధా టవర్స్‌ను డి-నోటిఫై చేసి తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి, మరోపక్క మంగళగిరిలోని 22 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మిస్తామని చెప్పటం వెనుక దోపిడీ దాగుందన్నారు. ఒక్కొక్క చదరపు అడుగు నిర్మాణానికి 5 వేల రూపాయలు చెల్లిస్తామని సిఎం చంద్రబాబు చెప్పటమే పెద్ద అవినీతి అన్నారు. రాష్ట్రానికి చెందిన భవన నిర్మాణ యజమానులు ముందుకు వచ్చి చదరపు అడుగు నిర్మానికి ఎంత ఖర్చు ఆవుతుందో ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించి చదరపుఅడుగు నిర్మించినప్పటికీ కేవలం 2,000 రూపాయలు మించదన్నారు. సింగపూర్ దేశస్థులు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చారని ప్రకటించిన ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు చెల్లించటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పాలన సాగించి ప్రజలకు ప్రయోజనాలు కల్పించాలని అంబటి కోరారు.