డైలీ సీరియల్

అమ్మానాన్నకు - 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను వెళ్లి ఆ బంగారు పూవును తీసుకొచ్చాను. నేను పూవుతో తిరిగి రావడం చూసి అమ్మా నాన్న, కరస్పాండెంట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు గుండె, ఒక చేయి తప్ప మరేమీ మిగలని విషయం వాళ్లకు తెలీలేదా, తెలిసినా తెలీనట్టు ఉన్నారో అర్థం కావడంలేదు.
నాలాగానే ఉన్న బొమ్మకు నా గుండెను, చేతిని అమర్చి నన్ను వాళ్ల భుజాలపైన పెట్టుకుని ఊరేగిస్తున్నారు. లక్షలాదిమంది జనం నన్ను చూసి జేజేలు పలుకుతున్నారు..
నాతో షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, నాతో మాట్లాడాలని జనం ఎగబడుతున్నారు.. జనం తొక్కిసలాటలో అమ్మ నాన్న, కరస్పాండెంట్‌లు కింద పడిపోయారు. వాళ్ల చేతుల్లో ఉండే బంగారు పూవు కూడా కింద పడిపోయింది. జనం మా మీదుగా పరుగులు.. నాలాంటి బొమ్మ ముక్కలు ముక్కలుగా మారిపోయింది.. గుండె, చేయి జనం కాళ్ల కింద పడి నలిగిపోతున్నాయి. వాళ్లు తొక్కుతున్నది ఎవరి గుండెనో వాళ్లకు అర్థం కావడంలేదు. నా గుండెమీద కాలు పెట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ల గుండెను బాధగా తడిమి చూసుకుంటున్నారు’.
‘‘రేయ్.. మహేష్ లేవరా నిద్ర.. ఇంకా పడుకోనున్నావే’’ అంటూ కుదపడంతో కలలోంచి, నిద్రలోంచి మెలకులోకి వచ్చాను.
ఎదురుగా ఆనంద్ ఉన్నాడు. వాడిని చూడటం సంతోషం అనిపించింది.
‘‘టైమ్ ఎనిమిది గంటలురా.. ఇంకా పడుకోనున్నావే.. లేరా.. లే’’ అన్నాడు.
‘‘రాత్రి బాగా నిద్రపట్టిందిరా.. ఒక రోజులో ఇన్ని గంటలసేపు నిద్రపోయి ఎన్ని సంవత్సరాలయిందో’’ అన్నాను ఆవులిస్తూ.
అమ్మ కాఫీ తెచ్చింది.
ఇద్దరం కాఫీ తాగుతూ కబుర్లలో పడిపోయాం. ఆనంద్‌కు ఇంటర్లో తొమ్మిది వందల పది మార్కులు వచ్చాయి. వాళ్ల చెల్లికి టెన్త్‌లో ఐదు వందల ముప్ఫై నాలుగు వచ్చాయి. ఇద్దరికీ కూడా మంచి మార్కులే.. అదే అన్నాను వాడితో..
‘‘నీతో పోలిస్తే మావెంతరా?’’ అన్నాడు వాడు.
‘‘అలా ఎలా పోలుస్తావురా?.. మీతో పోలిస్తే నేను, అందరికీ అన్నిటికీ దూరంగా ఉండి ఎంత హింస అనుభవించానో.. దాన్ని దేంతో ప్చోగలంరా?’’ అన్నాను.
దానికి నిజమే అన్నట్టు తలూపాడు. వాడు ఎంసెట్ రాయలేదని చెప్పాడు. లెక్చరర్ కావాలనేది వాడి లక్ష్యమట. అందుకని ఎంసెట్ రాయలేదని చెప్పాడు. డిగ్రీ, పీజీ, పిహెచ్‌డి చేస్తానని చెప్పాడు. శ్రీకాంత్ అంకుల్ వస్తారేమో అనుకున్నా రాలేదు. తను డ్యూటీకి వెళ్లారని చెప్పాడు వాడు. గంటసేపు ఉండిపోయాడు.
మరో రెండు రోజుల్లో ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. అందులో కూడా నేనే స్టేట్ ఫస్ట్.. మళ్లీ ప్రశంసలు.. కరస్పాండెంట్ కారు పంపించి నన్ను రమ్మని చెప్పాడు. నాకు ఇంటి దగ్గరనుంచి ఎక్కడికీ పోవడం ఇష్టం లేదు. ఆ మాటే అన్నాను.
అందుకు అమ్మా నాన్న ఒప్పుకోలేదు.. ‘‘రెండేళ్లు ఉచితంగా భోజనం పెట్టి, ఉచితంగా చదువు చెప్పిన వ్యక్తికారు పంపితే పోకుంటే ఎలా?,.. తప్పు.. పోకపోవడం మంచి పద్ధతి కాదు వెళ్ళు’’ అని బలవంతం చేశారు.
నాకు ర్యాంకు రావడంవలన ఆయనకు ఎంత అదాయం వస్తుందో నాకు తెలుసు. అది అమ్మా నాన్న అర్థం చేసుకోరు. వచ్చిన వాళ్ళతో పాటు కారెక్కాను. అమ్మా నాన్న ఇంటి దగ్గర లేకపోవడంతో సన్నజాజి చెట్టు ఎండిపోయింది. గోడలు కూడా రంగులు వెలిశాయి. ఎండిపోయిన సన్నజాజి చెట్టు పక్కన రంగు వెలసిన గోడకు ఆనుకుని అమ్మ ననే్న చూస్తోంది.. నాన్న కారు వద్దకు వచ్చి బై చెప్పారు.
నాతో మాట్లాడాల్సింది ఉందని శ్రీకాంత్ అంకుల్ చెప్పారు. నాక్కూడా అంకుల్‌తో మాట్లాడాల్సిన విషయాలున్నాయి. అవేవీ మాట్లాడుకోకుండానే బయలుదేరేశాను. సొంతూరి నుంచి అవే నా చివరి అడుగులు అవుతాయని అప్పుడు అనుకోలేదు.
మళ్లా రెండు రోజులు హడావుడి.. అన్ని పేపర్లలో మెయిన్‌లో మొదటి పేజీలో నా ఫొటో వేశారు.
అమ్మా నాన్న తిరిగి అద్దె ఇంటికి వచ్చేశారు. ఉద్యోగాలకు పోతున్నారు. నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించడంలేదు. అది నా ఇల్లు కానట్టు, అమ్మా నాన్న కూడా ఎవరో పరాయివాళ్లలాగా అనిపిస్తున్నారు. ఆ రోజు వచ్చిన కల అపుడపుడు గుర్తుకు వస్తోంది. కల అలా ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ కూర్చునేవాడిని. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే, చదువుపైన శ్రద్ధ తగ్గుతుందని నన్ను కంప్యూటర్‌లో డిప్లొమా కోర్సులకు పంపించారు. ఉదయం పోవడం, సాయంత్రం ఇంటికి రావడం, తినడం పడుకోవడం.. ఇదే పని..
మరో నెలకంతా హైదరాబాద్‌లో చేరాను. అది చాలా పేరున్న కాలేజీ.
కాలేజీకి బయలుదేరే రోజు అమ్మ ‘‘నాన్నా.. ఇన్నాళ్లూ ఇదే ఊర్లో ఉన్నా నిన్ను కలుసుకునే అవకాశం రాలేదు. నీ చదువు పాడు కాకూడదనే మేము దూరంగా ఉన్నాం. ఇన్నాళ్ల చదువు ఒక ఎత్తు.. ఈ ఐదేళ్లు ఒక ఎత్తు. మాపైన దిగులు పెట్టుకోకుండా బాగా చదువుకో.. మేము అంత దూరం రాలేం.. ఎపుడైనా నీకు సెలవు ఉన్నపుడు వచ్చిపో’’ అంది.
నాకు అమ్మా నాన్న దగ్గర ఉండాలనే కోరిక ఎపుడో నశించిపోయింది. వాళ్లను చూడాలని కూడా అనిపించదు. ఊర్లో తెలిసినవాళ్లెంతో, వీళ్లూ అంతే.. ఆ మాటలు చెబితే బాగుండదని చెప్పలేదు.

- ఇంకా ఉంది

-సుంకోజి దేవేంద్రాచారి