11న అనగనగా ఒక చిత్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ పతాకంపై జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కామెడీతో కూడిన థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కమర్షియల్ చిత్రానికి కావలసిన హంగులన్నీ ఉన్నాయని, సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయని తెలిపారు. జార్జియా దేశ రాజధాని టిబ్లిసి, స్నో, కాస్‌బెర్న్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన పాటలు అందంగా ఉంటాయని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి, షాయాజి షిండే, ప్రభాస్ శ్రీను, వెనె్నల కిశోర్, సూర్య, గిరిబాబు, రఘబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు: అజయ్, సంగీతం: వినోద్ యాజమాన్య, ఎడిటింగ్: సాయిబాబు.టి., నిర్మాతలు: జె.ప్రభాకర్‌రెడ్డి, కొడాలి సుబ్బారావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జె.ప్రభాకర్‌రెడ్డి,