ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి ఆనందగజపతి రాజు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: విజయనగరం మాజీ సంస్థానాధీశుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతి రాజు శనివారం ఉదయం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన రాష్ట్ర విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రిగాను, రెండుసార్లు బొబ్బిలి ఎంపీగాను సేవలందించారు. మాన్సాస్ ట్రస్టు అధిపతిగా అనేక విద్యా సంస్థలకు నేతృత్వం వహించిన ఆయన సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా వ్యవహరించారు. ప్రస్తుత కేంద్ర విమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు అన్నయ్య అయిన ఆనందగజపతి రాజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కొనే్నళ్లుగా సింహాచలంలో శేషజీవితం గడిపారు. ఆయన మొదటి భార్య ఉమాగజపతి రాజు విశాఖ ఎంపీగా ఒకసారి గెలిచారు. ఉమాకు విడాకులిచ్చిన తర్వాత ఆయన రెండోపెళ్లి చేసుకున్నారు. ఆనంద్ మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు విజయనగరంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.