రాష్ట్రీయం

మీకు మీరే స్ఫూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 20: నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో దేశీయ ఉత్పత్తి వివరాలు ఈసారి నమోదు చేయగా, ఇకపై గ్రామస్థాయిలో గణాంకాలు సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని సిఎం చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. ప్రతి త్రైమాసికంలో వచ్చే ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ‘ప్రగతి నివేదిక’లని అన్నారు. పాలనలో ఉత్తీర్ణత సాధించామా, లేదా? అనేది నివేదికలతో వెల్లడవుతుందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను పరిశీలించిన సిఎం, దేశీయ వృద్ధిరేటు 5.6 శాతం వుండగా, రాష్ట్ర వృద్ధిరేటు 11.72 శాతం నమోదు కావడంపై అధికారులను అభినందనందించారు. తన తర్వాత విస్తృత అధికారాలు జిల్లాల కలెక్టర్లకే వున్నాయన్నారు. అందరినీ కలుపుకుని వెళ్తూ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం కలెక్టర్లకు ఉందని విజయవాడలో రెండు రోజుల కలెక్టర్ల సదస్సు తొలిరోజు కార్యక్రమంలో చెప్పారు. ‘ప్రజా సంక్షేమం -సంతృప్తి పరమావధిగా పనిచేస్తున్నాం. మీకు మీరే ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకుని పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించగలం. ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని చివరి లబ్ధిదారుడి వరకు చేర్చడమే లక్ష్యం కావాలి. ఇన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మీ అందరికీ అభినందనలు’ అన్నారు. మూడేళ్లలో 13సార్లు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ప్రజలకు అవసరమైన సేవలు, సమస్యలు, పథకాలు, కార్యక్రమాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. మనందరి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేలా చేస్తున్నామని, ఎంత అభివృద్ధి చేసినా సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందని స్పష్టం చేశారు. అందుకే వేల కోట్ల లోటున్నా రూ.24 వేల కోట్ల వరకు వ్యవసాయ రుణాల నుంచి రైతన్నకు ఉపశమనం కలిగించామన్నారు. మొత్తం 5 విడతల్లో వడ్డీ సహా రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నిలబెట్టుకుంటున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతలు పూర్తిచేశామని, మూడో విడత రుణ ఉపశమనానికి సన్నద్ధమయ్యామన్నారు.
డ్వాక్రా సంఘాలు అతిపెద్ద ఆస్తి
90లక్షల మంది మహిళలు సంఘటిత శక్తిగా ‘స్వయం సహాయక సంఘాల’ రూపంలో మన దగ్గర వున్నారని, డ్వాక్రా సంఘాలు మనకున్న అతిపెద్ద ఆస్తి అని బాబు అన్నారు. స్వయం సంఘాల మహిళలకు పెట్టుబడి నిధి కింద ఒక్కొక్కరికి
రూ.10 వేలు రుణం మాఫీ చేశామని, ఇందులో ఇప్పటికే రూ.6 వేలు చెల్లించగా మిగిలిన రూ.4 వేలు త్వరలోనే ఇస్తామన్నారు. 46 లక్షల మందికి ప్రభుత్వోద్యోగుల మాదిరిగా సరిగ్గా ప్రతినెలా 1న పింఛన్లు అందిస్తున్నామన్నారు. ‘చంద్రన్న బీమా’ కింద చనిపోయిన వారికి, ఇంకా పాక్షికంగా, శాశ్వతంగా అంగవైకల్యం సంభవించినా అండగా నిలుస్తున్నామన్నారు. అక్టోబర్ 2 నుంచి 50 ఏళ్లలోపు వయస్సున్న వారు సహజంగా మరణించినా కుటుంబానికి రూ.2లక్షలు అందిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు నెలనెలా ఉపకార వేతనాలు, కుల ఆదాయ, ధృవీకరణ పత్రాలు అందిస్తున్నామన్నారు.
లాభదాయక సాగువైపు అడుగులు
సంప్రదాయ వ్యవసాయం నుంచి లాభదాయక వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేసేలా ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకుంటున్నామని, నూరుశాతం భూసార నిర్థారణ పరీక్షలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో సుమారు 2కోట్ల ఎకరాల సాగుభూమి వుంటే అందులో 40 లక్షల ఎకరాల్లోనే ఉద్యాన పంటల సాగు జరుగుతోందని, దీన్ని కోటి ఎకరాలకు పెంచాలని లక్ష్యం నిర్దేశించారు. అలాగే 20 లక్షల ఎకరాలకే పరిమితమై సూక్ష్మ సేద్యాన్ని కోటి ఎకరాలకు విస్తరించాలని స్పష్టం చేశారు. మత్స్య, ఉద్యాన, పశు సంవర్థక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక ఆదాయం ఆర్జించటం సాధ్యమన్నారు. ‘మత్స్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కాలుష్యం ఈ రంగానికి పెనుసవాలుగా మారింది. దాన్ని అధిగమించి ఈ రంగంలో ఫలితాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో తగ్గడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా నమోదవడం వంటి కారణాల వల్ల స్మార్ట్ వాటర్ గ్రిడ్‌ను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్‌లో భాగంగా నదుల అనుసంధానానికి పట్టిసీమతో శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులను అనుసంధానించడమూ లక్ష్యమన్నారు. భూగర్భ జలాల పెంపునకు చేపట్టిన కార్యక్రమాలతో 11.54 మీటర్ల లోతులోనే భూగర్భ జలవనరులు ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్నాయని తెలిపారు. ఏ ఊరిలో పడిన వర్షం ఆ ఊరిలోనే ఇంకేలా చూడాలని, అప్పటికీ నీటి కొరత తలెత్తితే స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా సమస్యను అధిగమించవచ్చని సిఎం చంద్రబాబు వివరించారు.