ఆంధ్రప్రదేశ్‌

అన్నవరం కొండమీద అశ్లీల నృత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారుల ఉదాసీనత ఆలయ పవిత్రతపై కొరవడిన నిఘా
శంఖవరం, మార్చి 12: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంపై శుక్రవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయడంతో పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సాంప్రదాయానుసారం చేసుకునే వేడుకలకు నియమ, నిబంధనలు తెలియపరచడంలో దేవస్థానం సిబ్బంది విఫలం కావడంతో వేడుక నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అన్నవరం దేవస్థానంలో శుక్రవారం రాత్రి ఒక పెళ్లి బృందం నిర్వాహకులు వినోదం కోసం ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలో మత్తెక్కించే పాటలకు అనుగుణంగా చేసిన అశ్లీల నృత్యాలు భక్తులను విస్మయ పరిచింది. వాకలపూడికి చెందిన ఒక పెళ్లి బృందం సత్యగిరి కొండపై ఉన్న హరిహర సదన్ సత్రం వద్ద పెళ్లి ఏర్పాటు చేసుకుంది. ఈ వివాహ వేడుకకు భారీఎత్తున చేసిన ఏర్పాట్లు చేశారు. ఇది దేవస్థానమనే సంగతి మరచి టివి యాంకర్లు, సింగర్లతో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి మత్తెక్కించే పాటలను ఆలపించారు. అంతేకాకుండా ఊరంతా వినబడేలా నిర్వాహకులు త్రిడి సౌండ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందుకు తగినట్టుగానే ఉర్రూతలూగించే పాటలతోపాటు అశ్లీల నృత్యాలు చేయడం దేవస్థానం అధికారుల ఉదాసీన వైఖరికి అద్దం పట్టింది. సత్యదేవుని దర్శించేందుకు ఎంతో భక్తిప్రపత్తులతో కొండపైకి వేంచేసిన భక్తులు సైతం ఆర్కెస్ట్రా పాటలతో ఏమిటి ఈ విచిత్రం అని ముక్కున వేలేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు దేవస్థానంలో పలువురు ఉన్నత, చిరు ఉద్యోగులు, సెక్యూరిటీ అధికారులు సైతం హాజరై ఆర్కెస్ట్రా, నృత్యాలను ఆస్వాదించడం భక్తుల ఆగ్రహాన్ని కట్టలు తెంచేలా చేస్తోంది. దేవస్థానం పరిధిలో ఎక్కడా ఎటువంటి ఆర్కెస్ట్రాలు, రికార్డింగ్ డాన్సులుగాని పెట్టకూడదని కఠిన నిబంధనలు ఉన్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోగా నిర్వాహకులకు అడ్డు చెప్పకపోగా, వారితోపాటు వినోదాన్ని తిలకించడం గమనార్హం. గతంలో కూడా హరిహర సదన్ వద్ద ఇటువంటి సంఘటనలే రెండు, మూడు పర్యాయాలు జరిగినప్పటికీ అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబించారు. ఆ కారణంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆధ్యాత్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఘటన ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలోనూ వచ్చినా దేవస్థానం అధికారుల్లో చలనం లేకపోవడం విశేషం. దీంతో దేవస్థానం అధికారులు హడావిడిగా ఘటనకు కారణమైన పెళ్లి బృందం నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు. హరిహరసదన్ సత్రం వద్ద విధుల్లో ఉన్న చిరుద్యోగిపై చర్యలు తీసుకుని దేవస్థానం అధికారులు చేతులు దులుపేసుకున్నారు. శుక్రవారం రాత్రి సత్యగిరి కొండపై జరిగిన సంఘటనపై దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కాకర్ల నాగేశ్వరరావును వివరణ కోరగా జరిగిన సంఘటనను తాను మీడియాలో ప్రసారం కావడం చూశానని, వెంటనే స్పందించి దీనికి కారణమైన పెళ్లి నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. హరిహర సదన్‌లో విధుల్లో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా దేవస్థానం ఆచార, సాంప్రదాయాలను కాపాడాల్సిన అధికారులు ఉదాసీన వైఖరిని విడనాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక్కడ పనిచేసే అధికారులు ఉదయం పూట తనిఖీలు తప్ప, విధులు ముగిస్తే ఏ శాఖలో ఏమి జరుగుతుందో వారికే తెలియని పరిస్థితి.