ఆంధ్రప్రదేశ్‌

పాలిటెక్నిక్ ఫీజుల సవరణపై కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌ల్లో నిర్వహిస్తున్న వివిధ డిప్లొమో కోర్సుల ఫీజులను సవరించేందుకు వీలుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కమిటీని నియమించింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులను పెంచాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. సాంకేతిక విద్య స్పెషల్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ఆ శాఖ జాయింట్ డైరెక్టర్, తిరుపతి, కాకినాడ ఆర్‌జేడీలు, ప్రైవేట్ పాలిటెక్నిక్ యాజమాన్యాల ప్రతినిధులు నలుగురు ఉంటారు.