ఆంధ్రప్రదేశ్‌

పశుగణాభివృద్ధిలో 20 శాతం వృద్ధి రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: ఈ ఏడాది పశుగణాభివృద్ధి రంగంలో 20 శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్యశాఖల లక్ష్యాలు, సాధించిన ఫలితాలను గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించి భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు దిశానిర్దేశం చేశారు. డ్వాక్రా మహిళల సేవలను ఉపయోగించుకుని పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో గ్రామీణ పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధికి రూ. 288.88 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 30,587 ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను, 15వేల ఎకరాల్లో మెగా పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలని కోరారు. పశుగ్రాస క్షేత్రాల్లో ఉత్పత్తి అయ్యే గ్రాసాన్ని మార్కెట్టుకు పంపిణీ చేసే బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక్కో పశువుకు రూ. 60వేల మేరకు బీమా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పశుగణాలకు ‘గోకులం’ వసతి గృహాలను ఇప్పుడున్న 400కు అదనంగా మరో 100 ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ఒక పశుగ్రాస క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
మత్స్యశాఖకు పోలవరంతో ఉజ్వల భవిత
మత్స్యశాఖ పురోగతిని సమీక్షిస్తూ పోలవరం ప్రాజెక్టు కాల్వలు భవిష్యత్తులో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలను మత్స్య రంగంలో సుసంపన్నం చేయనున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆక్వా చెరువులను శాస్ర్తియంగా, అధునాతనంగా తీర్చిదిద్దాలని, ఆక్వా పాండ్స్ నిర్వహణతోనే మన ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మేలిరకం రొయ్యల్లో 70 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో రొయ్యల ఉత్పత్తిలోని 5 అగ్రశ్రేణి రాష్ట్రాల్లో మన రాష్ట్రం నెంబర్ 1గా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. పాడిగేదెల పాల ఉత్పత్తి క్షీణతకు చారిత్రక, పూర్వపు సమాచారాన్ని తెప్పించి విశే్లషించాలని, నెలవారీగా ఉత్పత్తి పెంచడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి సూచించారు. భూకాలుష్యానికి కారకాలను కనిపెట్టడానికి, యాంటీబయోటిక్స్‌ను అధ్యయనంతో విశే్లషించడానికి ల్యాబ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పశుగ్రాసం విషపూరితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.