ఆంధ్రప్రదేశ్‌

శివకళ్యాణానంద భారతీస్వామి బ్రహ్మైక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 30: తమ బోధనల ద్వారా సమాజంలో ధార్మిక రుజువర్తనను పెంపొందింపజేసిన శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శివకళ్యాణానంద భారతీ మహాస్వామి గురువారం బ్రహ్మైక్యం చెందారు. ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామీజీ యథావిధిగా తమ దైనందిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని భగవంతుని సన్నిధికి చేరుకున్నారని శ్రీ మహాకామేశ్వరి ధర్మపరిపాలన సంఘం కార్యదర్శి, సీనియర్ ఆడిటర్ గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ గురువారం రాత్రి విలేఖర్లకు తెలియజేశారు. అరండల్‌పేటలోని శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠానికి శివ కల్యాణానంద భారతీస్వామి 1998 డిసెంబర్ 23వ తేదీన పీఠాధిపత్యాన్ని వహించి అప్పటి నుంచి తమ తనువును చాలించే వరకు ఆధ్యాత్మిక సేవలను విస్తృతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. పేరేచర్లలోని కళ్యాణ క్షేత్రంలో శివ కళ్యాణానంద భారతీస్వామి బ్రహ్మైక్యం చెంది మహాసమాధి పొందారు.