ఆంధ్రప్రదేశ్‌

సైబర్ నేరాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 30: సైబర్ నేరాల నియంత్రణకు దేశంలోని దర్యాప్తు సంస్ధలు సమీకృత విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకత ఉందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సాంకేతిక పరిఙ్ఞనం విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఎంత ప్రయోజనం ఉందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు. మైక్రోసాఫ్ట్, ట్రూత్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యాన విజయవాడలో గురువారం ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్’ అంశంపై సైబర్ నేరాలను అరికట్టేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి విధానంపై జాతీయ స్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు పోలీసు అధికారులతోపాటు వివిధ దర్యాప్తు సంస్థలు, పలు టెక్నాలజీ అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్‌ఆర్ వాసన్ మాట్లాడుతూ ఒకప్పుడు పరిమితంగానే ఉన్న అంతర్జాల సాంకేతిక పరిఙ్ఞనం క్రమేణా ప్రపంచమంతా విస్తరించిందని, తద్వారా సైబర్ నేరాలు తారాస్థాయిలో పెరిగిపోతున్నాయన్నారు. ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తూ జరుగుతున్న హ్యాకింగ్, ఆర్ధిక నేరాలతోపాటు, ప్రపంచానికి భద్రత ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు దర్యాప్తు సంస్థలు సమీకృత విధానాలు ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాలను అరికట్టేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. దర్యాప్తు సంస్థల పనితీరు మరింత మెరుగుపడాల్సిన అవసరముందన్నారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల సలహాదారు, ట్రూత్ ల్యాబ్స్ ఇండియా చైర్మన్ డాక్టర్ గాంధీ పిసి కాజా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 317కోట్ల మంది రోజుకు ఇంటర్‌నెట్ వాడుతున్నారని, వీరిలో 40కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారన్నారు. జీవన విధానంలో ఇంటర్‌నెట్ వాడకం ఓ భాగమైపోయిందని, నేరగాళ్ళు టెక్నాలజీ లూటీ చేస్తూ నేరాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు తెగబడుతున్న క్రమంలో వీటిని నియంత్రించి అధిగమించే దిశగా టెక్నాలజీని పెంపొదించుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఫోలీసు, టెలీ కమ్యూనికేషన్ సంస్థలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిసారించి సరికొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా సైబర్ నేరాలు అరికట్టేందుకు ఉపక్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాకింగ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎఎస్ రామశాస్ర్తీ, కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ యుఎస్‌ఏ బెత్సెబ్రోడర్ తదితరులు పాల్గొన్నారు.