ఆంధ్రప్రదేశ్‌

కాళహస్తీశ్వరాలయంలో అభిషేకాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూన్ 30: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రుద్రాభిషేకం మినహా అన్ని అభిషేకాలను రద్దు చేస్తూ ట్రస్టుబోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు గురువారం సాయంత్రం ఇ ఓ భ్రమరాంబ, ట్రస్టుబోర్డు సభ్యులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామి వారి దర్శనం కల్పించడానికి వీలుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అన్ని అభిషేకాలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. క్షీరాభిషేకం, పచ్చకర్పూర అభిషేకం, పంచామృత అభిషేకం, శ్రీసతి కంకుమార్చన తదితర కార్యక్రమాలన్నింటినీ రద్దుచేస్తున్నట్లు తెలిపారు. రుద్రాభిషేకానికి కూడా కేవలం 15 టిక్కెట్లను మాత్రమే విక్రయిస్తామన్నారు. ని వల్ల భక్తులకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు. కాగా 2017 ఫిబ్రవరి 8న ఆలయానికి కుంభాభిషేకం నిర్వహిస్తామని, ఇందుకోసం దక్షిణ భారత దేశంలోని పీఠాధిపతులను ఆహ్వానిస్తామన్నారు.