ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ లాయర్ల తీరు బాధాకరం: కెఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూన్ 30: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ న్యాయవాదులు అవలంభిస్తున్న తీరు దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చేగొట్టేలా వారు మాట్లాడుతున్నారన్నారు. వారి వ్యవహారశైలి న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించేదిగా ఉందన్నారు. గురువారం కర్నూలులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని పేర్కొన్నట్టుగానే హైకోర్టు విభజన జరుగుతుందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు న్యాయమూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు విభజన సున్నిత అంశమని, దీన్ని రాజకీయం చేయవద్దని కెసిఆర్‌కు హితవు పలికారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని కెసిఆర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప రెచ్చగొట్టే ధోరణితో అవలంభిస్తే మరింత జఠిలంగా మారుతుందన్నారు.