ఆంధ్రప్రదేశ్‌

16వ శతాబ్దం నాటి లక్ష్మీదేవి విగ్రహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 30: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయం పక్కన కృష్ణానది ఒడ్డున స్నానఘాట్‌ల నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా గురువారం ఉదయం 16వ శతాబ్దం నాటి నల్లరాతి అభయముద్రలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం బయల్పడింది. అలాగే దీంతోపాటుగా నల్లరాతిపై ఉన్న నాగబంధం ఇతర చిన్న చిన్న శిల్పాలు కూడా బయటపడ్డాయని మ్యూజియం అధికారి ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. లక్ష్మీదేవి విగ్రహం ఒక్కటే పూర్తిగా ఉందని, మిగిలినవి పగిలిపోవడంతో నదిలోనే వదిలిపెట్టామని, లక్ష్మీదేవి విగ్రహాన్ని రెండో ప్రాకారంలో భద్రపర్చి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని మ్యూజియం అధికారి ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు.

chitram అమరేశ్వర స్నానఘాట్‌లో తవ్వకాల్లో బయటపడిన 16వ శతాబ్దం నాటి అభయ ముద్రలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం