ఆంధ్రప్రదేశ్‌

కోస్తాంధ్రకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 30: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారింది. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాలో బుధవారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ములకలపల్లిలో 17 సెంటీమీటర్లు, టేకుపల్లిలో 15, వెంకటాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.