ఆంధ్రప్రదేశ్‌

భారీ వర్షాలతో నదులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం/పోలవరం/శ్రీకాకుళం/విజయనగరం, జూన్ 30: అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులు జలకళను సంతరించుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇసుక తినె్నలతో దర్శనమిచ్చిన జీవనదులు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రనీరు చేరుకుని నిండుగా కనిపిస్తున్నాయి. వర్షాలకు విలీన మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు, పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శబరి సహా ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఉప నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి నది నీటిమట్టం భారీగా పెరిగింది. ఇప్పటికీ భారీ వర్షం కురుస్తుండటంతో రానున్న 3, 4 రోజుల్లో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలంలో గత అయిదు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువలు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొవ్వాడ కాలువకు భారీ వరద నీరు రావడంతో కొవ్వాడ రిజర్వాయర్‌లోకి నీరు భారీగా చేరింది. రిజర్వాయర్‌లో గరిష్ఠ నీటిమట్టం 90.05 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 83.30 అడుగులకు చేరుకుంది. అలాగే వర్షాలకు మండలంలోని చెరువులకు భారీగా నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నీటిమట్టం 14 మీటర్లు దాటడంతో పట్టిసం ఎత్తిపోతల పథకంలోని మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే అవకాశం ఉంది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో శ్రీకాకుళంజిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామునుండి ఎడతెరిపి లేని వర్షం అన్ని ప్రాంతాల్లో కురిసింది. వంగర మండలంలో 41.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రణస్థలంలో 36.6, బూర్జలో 39.6, ఎల్ ఎన్ పేటలో 36.4, జి.సిగడాంలో 33.2 మిల్లీమీటర్ల సగటున వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదులు జలకళ సంతరించుకున్నాయి. గొట్టా బ్యారేజ్, తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం రిజర్వాయర్‌లు సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉండటంతో సాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. వాగులు వంకలు పొంగిపొరలి పంట పొలాలు కూడా చెరువులను తలపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే అత్యధిక వర్షపాతం జూన్ నెలలోనే నమోదు కావడంతో వరిసాగు సాధారణం కంటే మరింత పెరిగి అవకాశం లేకపోలేదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. విజయనగరం జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడగా గురువారం రోజంతా వర్షం కురుస్తునే ఉంది. వర్షాలతో విజయనగరం పట్టణం చిత్తడిచిత్తడిగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై భారీగా నిలచి రాకపోకలకు కొంత ఇబ్బంది కలిగించింది. పార్వతీపురం, బొబ్బిలి, శృంగవరపుకోట తదితర ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా గురువారం 3.37సెంటీమీటర్ల వర్షం కురిసింది. పూసపాటిరేగలో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షం కురియగా, మక్కువలో 6.9, గరుగుబిల్లిలో 6.7, భోగాపురంలో 6.2సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఈ నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 128.4మిల్లీమీటర్లుకాగా గురువారం నాటికి 182.7మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్లలో కూడా గురువారం విస్తారంగా వర్షాలు కురిసాయి. విశాఖ మన్యంలో గత రెండు రోజులుగా వర్షం పడుతునే ఉంది.

chitram..తోటపల్లి రిజర్వాయర్ నుంచి వరద నీటిని నాగావళి నదిలోకి విడిచిపెట్టిన దృశ్యం * పట్టిసం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది