ఆంధ్రప్రదేశ్‌

చిన్నారి కాలేయ మార్పిడి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: కాలేయ వ్యాధితో బాధపడుతున్న 8 నెలల చిన్నారి జ్ఞానసాయి ఆపరేషన్ మరో నెల రోజుల పాటు వాయిదా పడింది. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందు అవసరమైన అన్ని వైద్య, ఆరోగ్య పరీక్షలను వైద్యనిపుణులు పూర్తి చేశారు. తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి జ్ఞానసాయిని అనారోగ్యం నుండి గట్టెక్కించేందుకు తండ్రి రమణప్ప ముందుకు వచ్చాడు. రమణప్ప కాలేయానికి సంబంధించి అన్ని రకాల వైద్య ఆరోగ్య పరీక్షలు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో నిర్వహించారు. తండ్రికి ‘్ఫ్యటీ లివర్’ ఉండటం వల్ల వెంటనే శస్త్ర చికిత్స సాధ్యం కాదని నిర్ణయించారు. నెల రోజులపాటు కొన్ని ఆహార నియమాలు పాటించి రమణప్పతో పాటు జ్ఞానసాయిని తిరిగి రావాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో జ్ఞానసాయిని తీసుకుని తల్లిదండ్రులు వారి స్వగ్రామమైన చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలం ఆర్‌ఎస్ కొత్తపల్లి బయలుదేరి వెళ్లారు. ఈ లోగా మధ్యలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే వారిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. ఈ సమాచారాన్ని చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కి తెలియజేశారు.