ఆంధ్రప్రదేశ్‌

ఏ ఫార్మెట్‌లో కావాలో చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: వైకాపా తరఫున అసెంబ్లీకి ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించడంపై ఆ పార్టీ మండిపడింది. శనివారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సరైన ఫార్మెట్‌లో పిటిషన్ ఇవ్వలేదని స్పీకర్ చెప్పారన్నారు. కాని ఏ ఫార్మెట్ కావాలో స్పీకర్ చెప్పాలన్నారు. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. 13 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇచ్చిన పిటిషన్‌ను ఏ ప్రాతిపదికన తిరస్కరించారో స్పీకర్ సహేతుకంగా చెప్పలేదన్నారు. ఫిరాయింపులు అనైతికమంటూ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కాని రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా స్పీకర్ చర్యలు ఉన్నాయన్నారు. ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టులో ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుందన్నారు. అందుకే స్పీకర్ హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తనవైపు అనర్హత వేటు వేయాలని వచ్చిన పిటిషన్లు పెండింగ్‌లో లేవని చెప్పేందుకు స్పీకర్ అర్థంపర్థం లేని సాంకేతిక కారణాలు చూపించారన్నారు. స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.