ఆంధ్రప్రదేశ్‌

ఆగస్టు ఒకటి నుంచి బేబీ కిట్లు:కామినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూలై 2: ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా పని చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఆయన ప్రకాశం జిల్లా చీరాల వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం అమలు తీరు బాగుందన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ వాహనాన్ని వినియోగించుకున్న వారికి బేబి కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. తల్లితో పాటు బిడ్డల మరణాల సంఖ్య తగ్గించే చర్యలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.