ఆంధ్రప్రదేశ్‌

18న సింహగిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, జూలై 2: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న జరిగే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవో రామచంద్రమోహన్ శనివారం దేవాలయంలో దేవస్థానం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసారు. చతుర్థశి రోజున గిరి ప్రదక్షిణ, పౌర్ణమి రోజున ఆలయ ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్ల పై ఆయన విభాగాధిపతులతో చర్చించారు. గిరిప్రదక్షిణలో భాగంగా 18న మధ్యాహ్న రెండు గంటలకు కొండ దిగువ తొలి పావంచా నుండి పుష్ప రథాన్ని ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారన్నారు. 19న తెల్లవారుజామున మూడు గంటలకు కొండపై ఆలయ ప్రదక్షిణకు అనుమతించాలని, తెల్లవారు జామున అయిదు గంటలకే భక్తులకు దర్శనాలు ఇవ్వాలని, 18న భక్తుల తాకిడిని బట్టి రాత్రి దర్శనం వేళలు పెంచాలని నిర్ణయించారు.