ఆంధ్రప్రదేశ్‌

గుప్తనిధుల కోసం శివలింగం పెకలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలదంకి, జూలై 2: గుప్తనిధులకోసం పవిత్రమైన ప్రాచీనమైన శివాలయంలో శివలింగాన్ని పెకలించిన సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని కొండయ్య మఠం వద్ద ఉన్న ప్రాచీన శివాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు జరిపి అక్కడ వున్న శివలింగాన్ని పెకలిచారు. కావలి- ఉదయగిరి రోడ్డుకు కేవలం 10 మీటర్ల దూరంలో, పోలీస్‌స్టేషన్‌కు 250 మీటర్లు దూరంలో గల ఈ శివాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించి 10 అడుగుల లోతున గొయ్యి తవ్వి శివలింగాన్ని పెకలించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే పరమశివునికి అభిముఖంగా వున్న నంది విగ్రహాన్ని కూడా పెకలించి వేయగా ప్రస్తుతం అది కనిపించుట లేదు. దానిని తవ్విన వ్యక్తులు తీసుకెళ్లి వుంటారని భావిస్తున్నారు.