ఆంధ్రప్రదేశ్‌

లలితకు ముఖ్యమంత్రి అభయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 2: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ భార్య, పిల్లలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నగరంలో నైట్ బే మారథాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో శ్రీనివాస్ భార్య లలిత కలిసి, తన భర్తను విడిపించేందుకు సహకరించాలని కోరారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్వయంగా ఫోన్ చేసి శ్రీనివాస్‌ను విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారని, ప్రభుత్వ పరంగా కేంద్రంతో మాట్లాడి తన భర్తను విడిపించాలని అమె సిఎం చంద్రబాబును అభ్యర్ధించారు. తాను అధికారులతోను, కేంద్ర ప్రభుత్వంతోను చర్చించినట్టు వివరించారు. భయపడాల్సిన పనిలేదని, మీ భర్త క్షేమంగా తిరిగి వస్తారని అభయం ఇచ్చారు. అనంతరం ఇటీవల సౌదీ అరేబియా రియాద్‌లో మరణించిన బషీర్ కుటుంబ సభ్యులు సిఎం చంద్రబాబును కలిశారు. గాజువాక ఫకీర్‌తక్యాకు చెందిన బషీర్ కుటుంబీకులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్ సాయంతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ నజీర్ స్వయంగా సిఎం వద్దకు తీసుకువెళ్లారు. నిరుపేద కుటుంబం భర్త మృతితో తీవ్ర ఇబ్బందుల్లోపడిందని వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు సిఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బషీర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటీవల విశాఖ జిల్లాలోని పాయకరావుపేట మండలం పాల్మన్‌పేటలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా సిఎం చంద్రబాబు ప్రకటించారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన భర్త విడుదలకు కృషి చేయాలని కోరుతున్న సాయి శ్రీనివాస్ భార్య లలిత