ఆంధ్రప్రదేశ్‌

టెట్ క్రీడా సర్ట్ఫికెట్లు అప్‌లోడ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), జూన్ 11: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ఇనె్సంటివ్ మార్కుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా క్రీడల్లో తాము సాధించిన ప్రతిభాపత్రాలను అప్‌లోడ్ చేయాలని టెట్ కన్వీనర్ ఏ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 20లోపు ప్రతిభా సర్ట్ఫికెట్లను టెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. టెట్‌కు సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ఇనె్సంటివ్ మార్కుల కోసం వివిధ కేటగిరీల్లో 5,216 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని, ఈ నెల 20న అర్ధరాత్రి 12గంటల్లోపు అభ్యర్థులు తమ సర్ట్ఫికెట్లను అప్‌లోడ్ చేయాలని సూచించారు. అప్‌లోడ్ చేసిన సర్ట్ఫికెట్లు సంబంధిత ఫెడరేషన్‌లకు, యూనివర్శిటీలకు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు పంపి పరిశీలించి వాస్తవమని నిర్ణయించుకున్న తరువాత ఇనె్సంటివ్ మార్కులు కలుపుతారని తెలిపారు. బుధవారం ఉదయం 9గంటలు నుండి టెట్ వెబ్‌సైట్‌లో సర్ట్ఫికెట్లు అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి వివరించారు.