ఆంధ్రప్రదేశ్‌

జనవరి 1న తొలి కారు బయటకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: కియా మోటార్స్ ప్లాంటు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి చెందారు. కియా మోటార్స్ ఇండియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ప్లాంటు పనులపై సమీక్ష జరిపి అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై వీడియో చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఆ వేగాన్ని ‘కియా’ అందుకుంటోందని సంతృప్తిని వ్యక్తం చేశారు. 2019 జనవరి మొదటి తేదీ నాడు ఎట్టి పరిస్థితిలోనూ కియా తొలి కారు బయటకి రావాలంటూ నిర్దేశించారు. కొత్త సంవత్సరం కొత్త ఇండియన్ మేడ్ కారును దేశానికి అందించాలని కియా ప్రతినిధులకు సూచించారు.
చంద్రబాబుకు
ఏపీటీఎఫ్ కృతజ్ఞతలు
పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు తమ హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకొనేందుకు ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో మంగళవారం సాయంత్రం వారు సీఎంను కలిసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల తరపున సత్కరించారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో నియమించిన ప్రత్యేక ఉపాధ్యాయుల్లో 398 మందికి నోషనల్ ఇంక్రిమెంట్ జారీ చేసినందుకు వారి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధిక పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులకు హాఫ్ పే లీవ్‌ను నగదుగా మార్చుకొనేందుకు, 398 మంది ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయటం ఉపాధ్యాయులపై ఉన్న శ్రద్ధాసక్తులకు నిదర్శనమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఏపీటీఎఫ్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జె.పార్థసారధి, బిడబ్ల్యు. బిన్ని, ఏవి రావు తదితరులున్నారు.
ఒంగోలు డెయిరీ పునర్వైభవానికి సీఎం చర్యలు: మంత్రి శిద్దా
ఒంగోలు డెయిరీ పునర్వైభవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. డెయిరీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు పూర్తి సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పాడి రైతులు ఉద్యోగుల బకాయిల చెల్లింపు, డెయిరీ పునరుద్ధరణ దిశగా పనులు చేపట్టాలని మంత్రి శిద్దా రాఘవరావు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.