ఆంధ్రప్రదేశ్‌

రూ. 220 కోట్లతో గిడ్డంగుల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూన్ 14: రాష్ట్రంలో 220కోట్ల రూపాయల నిధులతో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని వేర్‌హౌస్ కార్యాలయంలో బుధవారం ‘ఈ-నెగోషబుల్ వేర్‌హౌసెస్ ఎలక్ట్రానిక్ రిసీప్ట్’ విధానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 6లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులు ఉన్నాయని, వీటికితోడు 220కోట్ల రూపాయల నాబార్డు నిధులతో మరో 40లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద స్పైసెస్ పార్కులో 50కోట్ల రూపాయలతో మిర్చి, పసుపు కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం 27 ఎకరాల స్థలాన్ని కూడా స్పైసెస్ పార్కులో సేకరించామన్నారు. వీటిద్వారా 2500 లారీల మిర్చిని ఒకేసారి ఇక్కడ డంప్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చన్నారు. డిసెంబర్ నాటికి నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 116 గిడ్డంగులలో 13.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులు నిల్వ ఉన్నాయని, 12చోట్ల రైతులు నేరుగా తమ సరుకును నిల్వ చేసుకుని ఎలక్ట్రానిక్ రశీదుల ద్వారా గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. అనంతరం తొలి ఎలక్ట్రానిక్ రశీదును మత్తయ్య అనే రైతుకు అందజేశారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ విజయవాడ డివిజనల్ మేనేజర్ శామ్యూల్ ప్రవీణ్‌కుమార్, ముంబైకి చెందిన గిడ్డంగుల అధికారిణి సరళా మీనా, వడ్లమూడి వేర్‌హౌస్ మేనేజర్ జి అంబేద్కర్, అధికారులు ఆచంటి శివకుమార్ పాల్గొన్నారు.