ఆంధ్రప్రదేశ్‌

లైంగిక వేధింపుల ప్రొఫెసర్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 14: వైద్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధ్యాపకునిపై విద్యార్థిని బంధువు దాడి చేసిన ఘటన నెల్లూరు నగరంలోని మెడికల్ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటనపై బాధిత విద్యార్థిని ఫిర్యాదుపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఏసి సుబ్బారెడ్డి వైద్య కళాశాలలో జనరల్ సర్జన్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న విద్యార్థిని పట్ల గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రొఫెసర్ వికృత చేష్టలపై ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. గురువారం కళాశాలలో హెచ్‌వోడీల సమావేశం జరుగుతుండగా బాధిత విద్యార్థిని, ఆమె సమీప బంధువు లోనికి వచ్చారు. అక్కడ ఉన్న చంద్రశేఖర్‌పై విద్యార్థిని బంధువుప్రజున్ దాడి చేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఖిన్నులైన తోటి అధ్యాపకులు అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోగా వారిపైనా దాడి చేశాడు. చంద్రశేఖర్ ముక్కుపై గాయం కావడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. తనను లైంగికంగా చంద్రశేఖర్ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చిత్రం..పోలీసు స్టేషన్ వద్ద దాడికి గురైన ప్రొఫెసర్