ఆంధ్రప్రదేశ్‌

బుగ్గనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు చేపట్టకూడదు: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: శాసనసభకు సంబంధించిన వివిధ కమిటీలన్నీ రాజ్యాంగపరమైన సంస్థలని, వాటికి సంబంధించిన చర్చలు, నివేదికలు, పత్రాలు అన్నీ గోప్యమని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆ వివరాలను మీడియా సహా ఎవరికీ ఇవ్వకూడదని, బహిర్గతం కూడా చేయకూడదని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఇస్తే అది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, నిబంధనల అతిక్రమణే కాక శాసనసభా ధిక్కారం కూడా అవుతుందని తెలిపారు. వివిధ అంశాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి సభ్యులకు గాని, పీఏసీకి గాని ఆయా శాఖలు పేపర్లను అందజేస్తాయని, ఆ పేపర్లు ఎవరికైనా ఇస్తే సభా ధిక్కార నేరమే అవుతుందని తెలిపారు. సభ్యుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రతిజ్ఞను కూడా ఉల్లంఘించడమేనన్నారు. ప్రస్తుత పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలో బీజేపీ నేతలను కలిసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయని, చైర్మన్ హోదాలో సేకరించిన పేపర్లను వారికి అందజేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయని తెలిపారు. శాసనసభలో ప్రాతినిధ్యం లేని వ్యక్తికి, రాజకీయ పార్టీ సభ్యునికి ఏ విధంగా పీఏసీ పేపర్లను బుగ్గన అందజేస్తారంటూ ప్రశ్నించారు. ఇది శాసనసభా ప్రవర్తనా నియమావళికి విరుద్ధం కాదా అంటూ ప్రశ్నించారు. అదే నిజమైతే ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు చేపట్టకూడదని ప్రశ్నించారు.