ఆంధ్రప్రదేశ్‌

నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 15: కేంద్రప్రభుత్వ ఉన్నత స్థాయి పదవి అయిన జాయింట్ సెక్రటరీలుగా ప్రైవేటు వ్యక్తులను నేరుగా నియమించే విధానానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తెరలేపిందని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. సాధారణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఐఏఎస్ అధికారులు, 15 సంవత్సరాలు సర్వీసు తర్వాత జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందుతున్నారని, ఈ ప్రక్రియకు స్వస్తిచెప్పి ప్రైవేటు వ్యక్తులను నేరుగా నియమించే ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమన్నారు. వాణిజ్యం, విమానయానం, రెవెన్యూ, ఆర్థిక తదితర ముఖ్యశాఖలకు జాయింట్ సెక్రటరీలను నేరుగా నియమించేందుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఆయా శాఖలకు సంబంధిత అంశాలపై నిష్ణాతులైన వారిని ఎంపిక కమిటీ నియమిస్తుందని వివరించారు. ఆయా సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానంలో నిష్ణాతులెవరు, వారి అర్హతలేంటి, ఎంపిక విధానం ఏమిటి అనేది కేంద్రప్రభుత్వ ప్రకటనలో పేర్కొనలేదన్నారు. ఎంపిక కమిటీ సభ్యులెవరనేది కూడా పొందుపర్చలేదని ఈ పద్ధతిలో కేంద్రంలో అధికార పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలను నిష్ణాతులుగా నిర్ణయించి జాయింటు సెక్రటరీలుగా నియమించే అవకాశాలున్నాయన్నారు. ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్‌లు, వివిధ శాఖల కార్యదర్శులు దొడ్డిదారిలో నియమితులైన జాయింట్ సెక్రటరీల ఆదేశానుసారం పనిచేయాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక పద్ధతి రాజ్యాంగ విరుద్ధమన్నారు. అధికరణాలు 14, 16 ప్రకారం దేశంలోని పౌరులందరికీ ప్రభుత్వ సర్వీసుల్లో చేరేందుకు సమాన అవకాశాలు ఉండాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ సర్వీసుల్లో న్యాయమైన వాటా కల్పించాలని, ఈ అధికరణాలు నిర్దేశిస్తున్నాయని వివరించారు. ఈ రాజ్యాంగ సూత్రాలకు మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆరోపించారు. ప్రభుత్వ సర్వీసుల నియామకం, తదితర అన్ని అంశాలపై రాజ్యాంగంలోని అధికరణం 309 నుంచి 323 వరకు మార్గదర్శకాలు నిర్దేశించారని, వీటిని ఉల్లంఘించి ప్రత్యక్షంగా ప్రైవేటు వ్యక్తులను జాయింట్ సెక్రటరీలుగా నియమించాలని నిర్ణయించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. కేంద్రప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.