ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి సహాయ నిరాకరణ సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతి రూపంలో దేశం గర్వించే స్థాయిలో హరిత నగరం నిర్మిస్తున్నామని, ఈ నగరం మీద వచ్చే ఆదాయంలో అధిక భాగం కేంద్రానికి వెళుతుందని, అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికి సహాయ నిరాకరణ ఎందుకో అర్థం కావటం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం విశ్వసనీయత కోల్పోతున్నదని, కో-ఆపరేటివ్ ఫెడరలిజం సూత్రాలకు కేంద్ర వైఖరి హానికరంగా మారిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటి నగర నిర్మాణానికి కేంద్రం అధికంగా నిధులిచ్చి ఆదుకోవాల్సింది పోయి అడ్డుకోవటం ఎంతవరకు సబబు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఈనెల 17న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావనాంశాలు, విభజన చట్టం అమలు చేయకపోవటంతో ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. జలవనరుల నిర్వహణ, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జలవనరుల రంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానంపై అధికారులు మరింత పరిశోధనతో కచ్చితమైన గణాంకాలు తయారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి కేంద్రం కేటాయింపులు సరిగ్గా లేవని ముఖ్యమంత్రి అన్నారు. భూగర్భ జలవనరుల నిర్వహణ, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పాలసీ అండ్ గవర్నెన్స్ విభాగంలో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కంటే 8 పాయింట్లు ముందుండి ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే సమయంలో కర్నాటక మనకంటే 12 పాయింట్ల దిగువన ఉందని వివరించారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ఏమి చర్యలు తీసుకోవాలో అద్యయనంతో సిఫార్స్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మనమే వెనుకబడి ఉన్నామని, అందువల్ల మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సమంగా తలసరి ఆదాయం సాధించేదాకా సహకరించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వల్ల కృష్ణపట్నం పోర్టు చెల్లిస్తున్న పన్నులు హైదరాబాద్‌కు వెళుతున్నాయని, ఇటువంటి అపసవ్య నిబంధనలు సరిచేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో మెరుగైన సామర్ధ్యం చూపిస్తున్నామని తెలిపారు. ఎన్ని అవరోధాలున్నా కేంద్ర సహకారం లేకున్నా ఒక విజన్‌తో రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేశామని తెలిపారు. యాభై లక్షల మందికి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. యాభై లక్షల మందికి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. విభజనతో వచ్చిన సమస్యలు ఎదురైనా, ఆర్ధికంగా ఎన్ని అవరోధాలున్నా, అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా రాజీలేకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. చంద్రన్న-పిఎంజెజె బీమా పథకం దిగ్విజయంగా అమలు చేస్తున్నామని, నాలుగేళ్లలో ఏమీ సాధించలేదని దుష్ప్రచారం చేసేవారికివే జవాబులని చెప్పారు. రాజధాని కోల్పోయి, కట్టుబట్టలతో, అప్పులతో వచ్చి వృద్ధిరేటులో దేశంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఆషామాషీ విషయం కాదన్నారు.