ఆంధ్రప్రదేశ్‌

అజ్మీర్ దర్గాకు సీఎం చాదర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాదర్ పంపించారు. రంజాన్ సందర్భంగా ఆ దర్గాకు చాదర్ పంపాలని ముస్లింలను కోరారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్‌కు ఈ చాదర్‌ను శుక్రవారం సీఎం అందచేశారు. 60 మీటర్లు ఉన్న ఈ చాదర్ అజ్మీర్ వెళ్తున్న ముస్లింలకు ఇవ్వాలని కోరారు. విజయవాడ నుంచి అజ్మీర్ దర్గా యాత్రకు కొంతమంది ముస్లింలు ఈ నెల 16న బయలుదేరి వెళ్లనున్నారు. రెండు ప్రత్యేక బోగీల్లో వెళ్తున్న వీరు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ చాదర్‌ను దర్గాలో సమర్పించనున్నారు. సీఎం ఆరోగ్యం బాగుండాలని, రాష్ట్భ్రావృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదరవ్వకుండా రక్షించాలని అక్కడ ప్రార్ధించనున్నారు.
సత్ప్రవర్తనకు మార్గదర్శనం రంజాన్
సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త మహితోక్తులు సదా స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. పవిత్ర ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్’ అని ముస్లింలు విశ్వసిస్తారని చెప్పారు. ఉపవాసాలు, దీక్షలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ.. ఇవన్నీ ఖురాన్ బోధనల్లో ముఖ్యమైనవని చంద్రబాబు గుర్తుచేశారు. ముస్లింలు నెల రోజుల కఠోర ఉపవాస దీక్షలు ఆచరించారని ఆయన అభినందించారు. ముస్లింలలో ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలన్నది తమ అభిమతమని తెలిపారు.
నేతల రంజాన్ శుభాకాంక్షలు
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పర్వదినాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వివిధ రాజకీయ పక్షాల నేతలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం..అజ్మీర్ దర్గాకు పంపించే చాదర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు