ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీలో ఎవరినీ కలువలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 15: ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏ రాజకీయ పార్టీ నేతలను కలవలేదని, కేవలం తన వ్యక్తిగత అవసరాల కోసమే ఢిల్లీ వెళ్లానని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ఆంధ్రభూమితో మాట్లాడుతూ తాను ఢిల్లీ వెళ్లే సమయానికే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అక్కడ ఉన్నారని తెలిపారు. ఆయన తనకు ఆప్తమిత్రుడని, ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఒక హోటల్‌కు వెళ్లామని ఆయన అన్నారు. దీన్ని కూడా టీడీపీ ప్రశ్నించడం సరైంది కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లోనే భోజనం చేయాలన్న నిబంధన ఏదీ లేదని తమకు ఇష్టమైన ఆహారం కోసం మరో హోటల్‌కు వెళ్లామని ఆయన వివరించారు. భోజనం చేసి తిరిగి ఆంధ్రాభవన్‌కు వచ్చి తాను తిరుగు ప్రయాణమయ్యేందుకు విమానాశ్రయం వెళ్లేందుకు సిద్ధం కాగా ఆకుల సత్యనారాయణ తన బంధువులను కలవడానికి తన కారులోనే వచ్చారన్నారు. ఆయన సౌత్ ఎండ్‌లో దిగి వెళ్లిపోయారని తాను నేరుగా విమానాశ్రయం వెళ్లానని బుగ్గన వివరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ లాగ్‌బుక్‌లో తాను బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికి వెళ్లినట్లు టీడీపీ నేతలు చేర్చారని ఆయన ఆరోపించారు. లాగ్‌బుక్‌ను పరిశీలిస్తే అది తేటతెల్లమవుతుందన్నారు. తాను తన వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్లానని తెలిపిన ఆయన ఒక వేళ బీజేపీ నేతలను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తాను ఎవరిని కలిస్తే టీడీపీ నేతలకు ఉలుకెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక పత్రాలు ఇవ్వడానికి పీఏసీలో రహస్య పత్రాలు ఏమీ ఉండవని, కమిటీ సభ్యులందరి వద్ద ఉన్న పత్రాలే తన వద్ద ఉంటాయని ఆయన తెలిపారు. అంతేగాక సామాన్యులు సైతం తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో కూడా అన్ని పత్రాలను ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. మరి రహస్యపత్రాలు తన వద్దకెలా వస్తాయో టీడీపీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలే తమ అవినీతిని బయటపెట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను కీలక పత్రాలు ఇస్తే కేంద్రం విచారణ చేపడుతుందని అదే జరిగితే అవినీతి ఉన్నదీ, లేనిదీ తేలుతుందని కదా అని అన్నారు. వైకాపా, బీజేపీ స్నేహం బహిర్గతమైందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. వారు 2014లో కూడా ఇలాగే ఆరోపించి చివరకు కలిసి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనని బుగ్గన అన్నారు. తనకు రాజకీయాల్లో అనేక పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని స్నేహం వేరు, రాజకీయాలు వేరని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలు, మంత్రులు అనవసరమైన ఆరోపణలు చేయకుండా రాష్ట్భ్రావృద్ధికి తమ సమయం కేటాయించాలని ఆయన సూచించారు.