ఆంధ్రప్రదేశ్‌

చేపల వేటకు డీజిల్ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 15: దాదాపు 60 రోజుల విరామం తరువాత చేపల వేట గురువారం అర్థరాత్రి నుంచి ఆరంభణ కావల్సిన చేపల వేట మొదలవలేదు. డీజిల్ సబ్సిడీపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి నిరసన తెలియచేశారు. దీనికి సంబంధించి డాల్ఫిన్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం రాష్టవ్య్రాప్తంగా 1500 బోట్లు నిత్యం వేటకు వెళ్తుంటాయి. గత ఏడాది వేట ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. మత్స్య పరిశ్రమ నష్టాల్లో ఉన్నా, నిషేధం ఎత్తివేసిన తరవాత వేటకు వెళ్లడానికి మత్స్యకారులు ఉపక్రమించారు. సంప్రదాయం ప్రకారం గురువారం అర్థరాత్రి గంగమ్మతల్లికి పూజ చేసి, బోట్లను వేటకు పంపుతారు. కానీ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచీ ఒక్క బోటు కూడా వేటకు వెళ్లలేదు. విశాఖలో సుమారు 700 బోట్లు ఫిషింగ్ హార్బర్‌లోనే నిలిచిపోయాయి. దీనికి డీజిల్ భారం కావడమే ఇందుకు కారణమని మత్స్యకారులు తెలియచేస్తున్నారు. లీటరు డీజిల్ ధర 38 రూపాయలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 6.03 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది. అయితే ఇప్పుడు డీజిల్ ధర సుమారు 76 రూపాయలకు చేరుకుంది. దీనికి 12.90 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. వేటపై నిషేధం విధించడానికి ముందు నుంచే మత్స్యకార సంఘాలు సబ్సిడీ గురించి ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకూ తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు.బోటు ఒకసారి వేటకు వెళ్లినప్పుడు కనీసం 250 లీటర్ల డీజిల్ ఫిల్ చేసుకోవాలి. సబ్సిడీ లేకుండా ఇప్పుడున్న ధర ప్రకారం డీజిల్ ఫిల్ చేసుకుంటే, ఒక్కో బోటుకు సుమారు 15 వేల రూపాయల వరకూ నష్టం వస్తుందని మత్స్యకారులు చెపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే వరకూ బోట్లు కదిపేది లేదని మత్స్యకారులు మొండికేశారు. మత్స్యకార సంఘ నేతలు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణను కలిసి పరిస్థితిని వివరించారు. మత్స్యకారుల వాదన విన్న తరువాత, తిరిగి శనివారం కూడా సమావేశమై సబ్సిడీపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు నాయకులు తెలియచేశారు.