ఆంధ్రప్రదేశ్‌

మీ వల్లే నిలబడ్డాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వెలగపూడి సచివాలయంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వడం ద్వారా ధాన్యం దిగుబడి ఎక్కువగా వచ్చిందని రైస్ మిల్లర్లు తెలిపారు. దీని వల్ల దాదాపు 3000 మంది మిల్లర్లను కాపాడారన్నారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ, రైసు మిల్లులకు అదనపు ఆదాయం లభించే విధంగా మరికొన్ని ఉత్పత్తులకు నాంది పలకాలని సూచించారు. రైస్ బ్రాన్ ఆయిల్, తౌడు తదితర ఉప ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండాలని తెలిపారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విధానాలను మార్చడం ద్వారా 11 శాతం వృద్ధి సాధించామని, మోదీ పాలనలో జాతీయ స్థాయిలో ఇందులో పదో వంతు కూడా చేరుకోలేకపోయారని విమర్శించారు. వ్యవసాయ సెస్ తీసేయాలన్న నిర్ణయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
సీఎంకు అండగా ఉంటాం
సీఎం పాలనలో వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుందని, 75 మంది టెక్స్‌టైల్ పరిశ్రమల ఎండీలు సీఎంను ప్రశంసించారు. విద్యుత్ రాయితీలు ఇవ్వడం ద్వారా బతికి బట్టకట్టామన్నారు. సీఎంకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ, టెక్స్‌టైల్ పరిశ్రమలపై త్వరలో ఒక పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు వివరించాలని కోరారు. కష్టపడి రాష్ట్భ్రావృద్ధికి పని చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

చిత్రం..ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న రైసుమిల్లర్లు