ఆంధ్రప్రదేశ్‌

అద్దె బస్సుల పెంపు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ఏపీఎస్‌ఆర్టీసీలో అద్దె బస్సుల శాతాన్ని పెంచే ప్రతిపాదన విరమించుకోవాలని ఎంప్లారుూస్ యూనియన్ (ఈయూ) నేతలు డిమాండ్ చేశారు. సిబ్బందిని తగ్గించాలన్న కుట్రలో భాగంగా ప్రస్తుతం 20 శాతం ఉన్న అద్దె బస్సులను 35 శాతానికి పెంచేలా ఈనెల 19న జరగబోతున్న బోర్డు మీటింగ్‌లో చర్చించి అమలు చేయాలనుకుంటున్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18 రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 128 డిపోలు, నాలుగు వర్క్‌షాపుల యూనిట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న మెయింటెనన్స్ ఉద్యోగులపై పనిభారాలు పెంచేలా ఈనెల 15 ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దుచేయాలని, అలాగే వేతనాల సవరణ జాప్యం జరుగుతున్నందున వెంటనే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మాదిరిగా 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించేలా బోర్డులో నిర్ణయం తీసుకోవాలన్నారు. యాజమాన్యం స్పందించకపోతే ఈనెల 20న విజయవాడలో జరగబోతున్న ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.
గుర్తింపు సంఘం కాల పరిమితి గత మార్చితోనే పూర్తయిందని వెంటనే ఎన్నికలు జరిపి గెలిచిన యూనియన్‌తో పూర్తిస్థాయి వేతనాల సవరణ జరపాలన్నారు. ప్రస్తుత గుర్తింపు సంఘం ఎన్‌ఎంయు లొంగుబాటు ధోరణి, యాజమాన్యం ఉదాశీనత కారణంగా వేతనాల సవరణలో జాప్యం జరుగుతోందన్నారు.