ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంపై ఒత్తి‘్ఢ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 17న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో విభజన అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేశారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్టప్రతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. గత సంవత్సరం నీతి ఆయోగ్ చేపట్టిన పనులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశాన్ని రాష్ట్ర విభజన హామీల అమలుకు వీలుగా ఒత్తిడి తెచ్చే వేదికగా ముఖ్యమంత్రి మలచుకోనున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై నీతి అయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ప్రధాని ప్రసంగం పూర్తయిన తర్వాత ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు నిర్ణయించారు. నీతి ఆయోగ్ సమావేశంలో అజెండాను అనుసరిస్తూనే, ఆయా రాష్ట్రాలు తామెదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించేందుకు ముఖ్యమంత్రులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక సీఎంలతో చంద్రబాబు నాయుడు మాట్లాడగా పాండిచ్చేరి, పంజాబ్, ఢిల్లీ సీఎంలతో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అవసరమైతే సమావేశాన్ని బాయ్‌కాట్ చేయాలని కూడా చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీలు కూడా ఆదివారం ఉదయం బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. విభజన హామీల అమలుపై మరోసారి ప్రధానిని కలవనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, రావలసిన బకాయిలు, విభజన హామీలు తదితర అంశాలపై పూర్తి స్థాయి ప్రజంటేషన్ ఇచ్చేలా 24 పేజీలతో సమగ్ర నివేదికను చంద్రబాబు నాయుడు సిద్ధం చేసుకున్నారు. పన్నుల ద్వారా వస్తున్న ఆదాయంలో వాటాను నీతి ఆయోగ్ ద్వారా పంచాలని డిమాండ్ చేయనున్నారు.