ఆంధ్రప్రదేశ్‌

వెయ్యికాళ్ల మండప నిర్మాణంపై న్యాయ స్థానంలో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 16: తిరుమలలో వెయ్యికాళ్ల మండపం నిర్మాణం పట్ల టీటీడీ యాజమాన్యం అలక్ష్యం వహిస్తే న్యాయస్థానంలో పోరాటం చేస్తామని వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం ఎమ్మెల్యే రోజా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌ను స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఆమె ఇఓకు వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా గతంలో తిరుమలలో కూల్చివేసిన వెయ్యికాళ్ల మండపం నిర్మాణాన్ని ఎప్పుడు చేపడతారో చెప్పాలని, అలక్ష్యం చేస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. అలాగే అప్పలాయగుంటలో డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలని కోరారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో నిత్యానందస్వామిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. దేశానికి ప్రధాని ఎవరో రాష్ట్రాన్ని ఎవరు విడదీసారో కూడా తెలియని మొద్దాబ్బాయ్ నారా లోకేష్ అన్నారు. కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ రమేష్ ఆమరణ దీక్ష కూర్చుంటామని అనడం హాస్యాస్పదం అన్నారు. కలియుగ ప్రత్యక్షదైవంగా వెలుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రకు భంగం కలిగించే వారు ఎవరైనా వదిలిబెట్టబోమని హెచ్చరించారు.