ఆంధ్రప్రదేశ్‌

గొల్లపాలెం గెయిల్ టెర్మినల్ వద్ద గ్యాస్ లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూన్ 16: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం సబ్ స్టేషన్‌కు వెనుకవైపున ఉన్న గెయిల్ టెర్మినల్‌లో శనివారం ఉదయం భారీ శబ్దంతో గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓఎన్‌జీసీ లీకేజీలతో పాటు గెయిల్ లీకేజీలు కూడా సంభవిస్తుండటంతో స్థానికులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. గొల్లపాలెం నుండి తాటిపాకకు వెళ్లే ఈ గ్యాస్ పైపులైన్ శనివారం ఉదయం స్వల్ప లీకేజీకి గురైంది. వెంటనే గెయిల్ సిబ్బంది అప్రమత్తమై లీకేజీని అదుపులోకి తెచ్చారు. ఈ రెండు గంటల వ్యవధిలో సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివాసం ఉంటున్న ప్రజలు ఇక్కడకు చేరుకొని లీకేజీలపై గెయిల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మలికిపురం తహసీల్దార్ జీవీ శేషగిరిరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఇక్కడ నుండి తాటిపాకకు, తాటిపాక నుండి విజ్జేశ్వరం పవర్ ప్రాజెక్ట్‌కు కొండపల్లి పవర్ ప్రాజెక్ట్‌కు గ్యాస్ సరఫరా అవుతూ ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీన కేశనపల్లి, ఏప్రిల్ 23న తూర్పుపాలెం జీసీఎస్‌లో అగ్ని ప్రమాదం, మే 1న మామిడికుదురు మండలంలో లీకేజీ, జూన్ 10న కేశవదాసు పాలెంలో లీకేజీ ఇలా వరుస లీకేజీలు కొనసాగుతుంటే తమ పరిస్థితి ఏమైపోతుందోనన్న ఆందోళనతో మలికిపురం, సఖినేటిపల్లి మండలాల ప్రజలు ఉన్నారు.

చిత్రం.. గెయిల్ సిబ్బందితో గొడవ పడుతున్న స్థానికులు